బాడీ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం

Prostitution in Massage Centers - Sakshi

చిలకలగూడ: బాడీ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకుడితోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, కండోమ్‌ ప్యాకెట్లు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు తెలిపిన మేరకు..  బెంగుళూరుకు చెందిన సమీర్‌ అగర్వాల్‌ (40) ఆరునెలల క్రితం మెట్టుగూడలో స్పా పేరిట మసాజ్‌ సెంటర్‌  ఏర్పాటు చేశాడు. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. 

‘లోకొంటో’  అశ్లీల వెబ్‌సైట్‌లో అందమైన యువతుల ఫొటోలతోపాటు తన సెల్‌ఫోన్‌ నంబర్‌ పెట్టాడు. ఆకర్షితులైన వారు ఫోన్‌ చేస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకుని తన స్పా సెంటర్‌ కు పిలిపించుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి వివరాలు సేకరించి పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు.  

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకుడు సమీర్‌ అగర్వాల్‌ (40)తో పాటు అక్కడ పనిచేస్తున్న వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన షాకీర్‌అలీ (35), సుమిత్‌సర్కార్‌ (28), విటులు యుపీకి చెందిన అమిత్‌బోస్‌ (40), నగరానికి చెందిన శశాంక్‌ (25), శ్రీకాంత్‌ (27), వెస్ట్‌ బెంగాల్‌కే చెందిన యువతులు మోంటీసింగ్‌ (24), లి యాదాస్‌ (25)లను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 20.130 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, కండోమ్‌ ప్యాకె ట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

కుషాయిగూడ: సెలూన్‌  ముసుగులో మసాజ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఓ సెలూన్‌ సెంటర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక  దాడులు జరిపి నిర్వహాకులతో పాటుగా పలువురిని అరెస్టుచేశారు.డాక్టర్‌ ఏఎస్‌రావునగర్‌లో స్పా సెలూన్‌ సెంటర్‌లో  కొంత కాలంగా పలువురు మహిళలతో క్రాస్‌ మసాజ్‌ను నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు సెంటర్‌పై ఆకస్మిక దాడులు జరిపారు. నిర్వహాకుడు హరీష్‌తో పాటుగా మసాజ్‌ చేస్తున్న ఇతర రాష్ట్రాల  మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, 500 నగదు స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top