మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్ | professor turns lunatic, creates ruckus | Sakshi
Sakshi News home page

మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్

Jan 20 2014 12:51 PM | Updated on Sep 2 2017 2:49 AM

మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్

మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్

అతనో ప్రొఫెసర్‌. అయితే ఉన్నట్టుండి ఆయన మానసిక పరిస్థితి అదుపు తప్పింది. అంతే నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు.

సూర్యాపేట : అతనో ప్రొఫెసర్‌. అయితే ఉన్నట్టుండి ఆయన మానసిక పరిస్థితి అదుపు తప్పింది. అంతే నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. అతను చేసిన వింత ప్రవర్తన వల్ల చివరకు తాళ్లతో బంధించాల్సి వచ్చింది. వరంగల్‌ జిల్లా రాజుపేటకు చెందిన కృష్ణ విజయవాడలోని  కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.

మానసిక ఆరోగ్యం బాగాలేకపోవటంతో అతడిని బంధువులు కారులో విజయవాడ నుంచి సొంతూరుకు తీసుకెళ్తున్నారు. కారు  సూర్యాపేట వద్దకు రాగానే కృష్ణ మానసిక ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏకంగా కారు  అద్దాలు బద్దలుకొట్టి రోడ్డుపైకి వచ్చాడు. గట్టిగా అరుస్తూ రోడ్డుపై వచ్చిపోయేవారందరినీ బెదిరించాడు. దీంతో స్థానికులంతా కలిసి ప్రొఫెసర్‌ను తాళ్లతో బంధించారు. అనంతరం బంధువులు అతడిని కారులో తీసుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement