ప్రొద్దుటూరులో 25న తారల క్రికెట్ | proddatur 25th movie actors cricket | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో 25న తారల క్రికెట్

May 12 2014 2:56 AM | Updated on Sep 2 2017 7:14 AM

ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్ట్స్ అండ్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సినీతారల సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు సినీ నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఇక్కడి రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్ట్స్ అండ్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సినీతారల సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు సినీ నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఇక్కడి రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్‌లో పాల్గొనేందుకు 35 మంది సినీతారలు ఇక్కడికి రానున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక టీంకు తాను, మరో టీంకు తరుణ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వివరిం చారు. టీజీఎస్‌ఎస్ అనే స్వచ్ఛంద సంస్థ బాలి కా సంరక్షణ, విద్య లాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగానే ఇక్కడ కూడా క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలోనూ 150 మంది బాలికలను దత్తత తీసుకుందన్నారు.
 
 ప్రొద్దుటూరులాంటి ప్రాంతంలో క్రికెట్ మ్యాచ్ జరగడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం సామాజిక దృక్పథంతోనే తాము మండుటెండల్లో సైతం మ్యాచ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామన్నారు. గతంలో కూడా తాము చాలా మ్యాచ్‌లు ఆడామని తెలిపారు. అయితే వైఎస్‌ఆర్ జిల్లాలో ఇలాంటి మ్యాచ్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. హీరోలు తరుణ్, నిఖిల్, సమీర్, కన్నడ హీరోయిన్ రాజశ్రీ మాట్లాడారు.
 
 క్రికెట్ మ్యాచ్‌కు అందరు హాజరు కావాలని కోరారు. సామాజిక కార్యక్రమం కోసం     నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.  సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు వీహెచ్7 క్రియేషన్స్ చైర్మన్ విక్కీ మాట్లాడుతూ 25న సాయంత్రం 5 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుందని, ప్రేక్షకులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రావచ్చన్నారు. టికెట్ల ధర రూ.300, రూ.500, రూ.800, రూ.1200 ఉన్నాయని తెలిపారు. సంస్థ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డి, నిర్వాహకుడు పి.రాకేష్‌రెడ్డి మాట్లాడారు. ప్రముఖ వ్యాపారవేత్త దండపాణి శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement