చిత్తూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు చంద్రగిరి బైపాస్ రోడ్డులో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులను బెంగళూరు వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.