త్వరలో పేదవాడి రాజ్యం | Prithviraj Secretary of State ViceCorp Visited Thirumala Venkateswara Swamy | Sakshi
Sakshi News home page

త్వరలో పేదవాడి రాజ్యం

May 17 2019 4:51 AM | Updated on May 17 2019 5:11 AM

Prithviraj Secretary of State ViceCorp Visited Thirumala Venkateswara Swamy - Sakshi

తిరుమల: పేదవాడి రాజ్యం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి,  సినీ నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ పృథ్వీరాజ్‌ తిరుమలేశునికి బుధవారం తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అత్యధిక స్థానాలు రావాలని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. జగన్‌ సీఎం అయితే ప్రజారంజక పాలన, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.  టీడీపీ కథ ముగిసిందని అన్నారు.  టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఒక్కరూ గెలవరని పృథ్వీరాజ్‌ చెప్పారు. కాగా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా బుధవారం తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement