పూజారి తాళ్లపూడి భాస్కరరావు కన్నుమూత

సాక్షి, విజయనగరం: ఎనిమిది సార్లు పైడితల్లి అమ్మవారి సిరిమానును అధిష్టించిన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సిరిమాను అధిరోహించిన పూజారిగా ఆయన గుర్తింపు పొందారు. భాస్కరరావు మృతితో విజయనగరంలో విషాదం అలుముకుంది. 2009- 2016 మధ్య కాలంలో శ్రీపైడితల్లమ్మ సిరిమానును భాస్కరరావు అధిరోహించారు. సిరిమానుపై అధిరోహించిన పూజారిని భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. (సిరులిచ్చే తల్లి.. శ్రీపైడితల్లి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి