
సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 321వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికమ్ క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి నైరా, కరిమిల్లిపేట క్రాస్, రోణంకి క్రాస్, భైరి జంక్షన్, కరజడ మీదుగా నర్సన్నపేట నియోజక వర్గంలోకి ప్రవేశించి మడపం, దేవాడి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.