అక్టోబర్‌ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమా | Pradhana mantry chandranna bima from October 2 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమా

Sep 10 2017 3:03 AM | Updated on Sep 12 2017 2:22 AM

అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు.

సాక్షి, అమరావతి: అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. 02–10–2017 నుంచి 31–05–2018 వరకు రెండో విడత పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వివరాలకు కాల్‌సెంటర్‌కు (నంబర్‌ 155214) ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement