టీడీపీ నేత గుట్టు రట్టు.. 

Possession Of Land Occupied By TDP Leader - Sakshi

అధికారులను కదలించిన  ‘సాక్షి’ కథనం 

ఆక్రమించిన పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు    

4 ఎకరాల 80 సెంట్లు భూమిని కాపాడిన ‘సాక్షి’  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం.. అందుకు సహకరించే ప్రజాప్రతినిధుల అండతో లక్షల రూపాయల విలువైన భూమిని ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్న పచ్చనేత భరతం పట్టింది ‘సాక్షి’ కథనం. అప్పటి వరకు తనకు ఎదురే లేదంటూ బాహుదా నది పరివాహక ప్రాంతాన్ని అనుభవిస్తున్న ఆ నేత మెడలు వంచి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి పంచాయతీకి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ కుమారుడు దూపాన సూర్యనారాయణ స్థానిక బాహుదానది పరివాక ప్రాంతంలో గల 4ఎకరాల 80 సెంట్ల భూమిని గత కొన్నేళ్ల నుంచి తన ఆదీనంలోకి తీసుకొని అనుభవిస్తున్నాడు. సుమారు రూ.50లక్షల రూపాయలు విలువైన ఈ భూమిని గతంలో మశాఖపురం గ్రామానికి చెందిన ఓ మాజీ సైనిక ఉద్యోగికి  ప్రభుత్వం కేటాయించింది. అయితే విలువైన ఆ భూమిపై కన్నేసిన టీడీపీ నేత ఆ భూ మిని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో కల్ల బొల్లి మాటలు చెప్పి విలువైన స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. పదేళ్ల పాటు వారి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అధికారులు సైతం ఆ స్థలం వైపు కన్నెత్తి చూడలేకపోయారు.

 ‘ఆక్రమణలో పోరంబోకు’ అన్న శీర్షికన సెప్టెంబర్‌ 24న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. విలువైన భూమిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆ టీడీపీ నేత శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కుట్రను ‘సాక్షి’ గుట్టురట్టు చేసింది. స్థానిక తహసీల్దార్‌ పర్రి అమల ఆక్రమణ భూమిని సెపె్టంబర్‌ 24న స్వయంగా పరిశీలించి సర్వే నిర్వహించారు.

ముందస్తుగా ఆ భూమిని తన భూమిగా నిరూపించుకోవాలని పదిహేను రోజుల క్రితం  ఫామ్‌–7 రూపంలో టీడీపీ నేత దూపాన సూర్యనారాయణకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో శుక్రవారం ఫామ్‌–6 రూపంలో 4ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వ ఆస్థిగా నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. తహసీల్దార్‌ పర్రి అమల శుక్రవారం సాయంత్రం ఆక్రమణ స్థలం వద్దకు వెళ్లి ‘ప్రభుత్వ భూమి’గా నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top