‘మద్యం కోసం పుస్తెలతాడు తెంచుకెళ్లాడు’

Political Satirical Story On Liquor Prohibition In Andhra Pradesh - Sakshi

రచ్చబండ

సాక్షి, కైకలూరు : సౌదమణి : ఏంటి.. శ్యామలక్కా.. మెడలో పసుపుకొమ్ములతాడు వేలాడుతోంది.. పుట్టింటోళ్లు పెట్టిన బంగారు పుస్తులేమైనావి.. 
శ్యామల : (కన్నీరు బడబడా కారుస్తూ) నా బాధ ఏ ఆడబ్డికు రాకూడదు చెల్లీ.. కట్టుకున్నోడు కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని చూస్తాడనుకున్నా.. మాయదారి మద్యం అలవాటైంది.. మా ఆయన రాత్రి తాగుడికి డబ్బులడిగాడు.. లేవన్నాను.. బలవంతంగా పుస్తులు తెంచుకెళ్లిపోయాడు..
సౌదమణి : ఆరే.. ఇటు చూడని.. మోడ కూడా కోసుకుపోయింది.. ఇంత అఘాయిత్యానికి ఆయనకు చేతులెలా వచ్చాయి.. ఇటురా మందు రాస్తా..
శ్యామల : చెల్లీ.. ఈ మందు రాస్తే.. గాయం మానుతుందేమోగాని.. ఆయన ఆ మందు మానటం లేదే.. సర్కారోళ్లు.. మద్యంలో ఆదాయం చూస్తున్నారే కాని.. మన జీవితాలు నాశనం అవుతున్నా.. పట్టించుకోవడం లేదు..
సౌదమణి : అవునక్కా.. ప్రభుత్వం నడవాలంటే మద్యం అదాయం ఒక్కటే సంజీవిని అనుకుంటున్నారు వాళ్లు.. ఏసీ గదులు వదిలి.. మన పేదల బస్తీలకు వస్తే తెలుస్తుంది.. ఎన్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయో.. 
తిరుపతమ్మ : వీధిన పడటమంటే గుర్తొచ్చింది.. సౌదమణి.. పాపం మన సీతాలు  ఆయన తాగి, తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోయాడు.. ముగ్గురు ఆడపిల్లలు. ఆమె జీవితం ఏం కావాలి.. పిల్లల్ని చదువులు మాన్పించి కూలీ పనులకు పంపుతోంది.. సీతాలు ఇళ్లల్లో పాచి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది.
సౌదమణి : ఒక్క సీతాలు జీవితామే కాదు.. తిరుపతమ్మ.. మనబస్తీలో మద్యం మహమ్మారికి సర్వనాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ.. వింటుంటే కన్నీరు ఆగదు..
ఫాతిమా : (అందరికీ టీ తెస్తూ) అందరూ.. బాగున్నారా.. మంచి గరం..గరం అల్లం ‘టీ’ మీ కోసం తెచ్చా.. తాగండి.. ఓయ్‌.. శ్యామల ఏంటీ ఏడుస్తున్నావ్‌.. మీ అత్త మళ్లీ టార్చర్‌.. పెట్టిందా..? 
తిరుపతమ్మ : ఫాతిమా.. ఎప్పుడూ.. వాళ్ల అత్తమీదే.. నీ అక్కసు.. శ్యామల వాళ్లయిన రాత్రి తాగి.. పుస్తులతాడు తెంపుకెలిపోయాడంటా.. 
ఫాతిమా :  అయ్యోయ్యో.. ఎంత పనిచేశాడు.. అలాంటోళ్లను పోలీసులతో చితక్కొంటిం చాలి.. అప్పుడు కాని బుద్ధిరాదు.. 
శ్యామల : ఓయ్‌.. ఫాతిమా.. మా ఆయనను పోలీసుతో కొట్టించమంటున్నావు ఏంటీ.. ఎంతైనా నన్ను కట్టకున్నాడు.. కొట్టినా.. పెట్టినా ఆయనే.. నాకు..
ఫాతిమా : ఇదిగో.. ఈ సెంటిమెంట్లే మన జీవితాలను పాడు చేస్తున్నాయి.. ఒక్క సారైన బుద్ధి రావాలి కదా.. అక్కా.. ఇలాగే ఉంటే వాళ్లలో మార్పు రాదు..
సువార్త : ఏమ్మా.. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.. పక్కంటి ప్రెండ్‌ ఒకటుందని మర్చిపోయారా ఏంటీ.. 
ఫాతిమా : అదేం కాదు.. ఇదిగే ముందు అల్లం టీ తాగు.. ఇక్కడ మగాళ్ల తాగుడు గురించి మాట్లాడుకుంటున్నాం.. 
సువార్త : ఏం.. తాగుడో ఏమిటోనమ్మా.. ఈ మద్య మందు షాపులు ఊరి చివర్లో పెట్టారని ఎంతో సంతోషపడ్డా.. ఇప్పుడు బస్తీలోనే ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు వచ్చేశాయి.. అంత దూరం వెళ్లలేక ఇక్కడే బడ్డికొట్లలో అమ్మేస్తున్నారు.. రాత్రి వేళ.. కుర్రోళ్లు.. ఒకటే తాగుడు.. చిందులు.. నిద్రపట్టడం లేదు.. ఈ పీడ ఎప్పుడు విరగడవుతోందో.. ఏమో..
సౌదమణి : సువార్త.. అసలు ఈ ప్రభుత్వాన్ని కడిగేయాలి.. మొన్న ఎన్నికల్లో ఏమన్నారు.. బెల్టు షాపులు ఒక్కటి కూడా లేకుండా చేస్తామన్నారు.. హామీలు ఇవ్వడమే కాని అమలు చేయడం వీళ్లకు తెలీయదేమో..
సువార్త : అవునక్కా.. ఈ మధ్య  రాజన్న తనయుడు తమ ప్రభుత్వం వస్తే మూడు దశల్లో మద్య నిషేధం చేస్తానన్నాడు.. జరుగుతుందంటావా.. 
సౌదమణి : చూడు.. సువార్త.. వాళ్ల నాన్నకు మల్లే ఈయన మాటమీద నిలబడే వ్యక్తి. మొదటి దశలో బెల్టు షాపులు లేకుండా చేయడం, రెండో దశలో మద్యం ధరలు పెంచడం, మూడో దశలోపెద్దహోటల్స్‌లోమాత్రమే మద్యం ఉండేవిధంగా చేస్తానన్నారు..
సువార్త : అవునక్కా.. ఇదే జరిగితే మన జీవితాలు బాగుపడతాయి అంటూ సాగిపోయారు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top