‘అందుకే చేతులు పైకెత్తి అరిచాను’ | Police Rescued Man Who Attempts Suicide At Prakasam Barrage | Sakshi
Sakshi News home page

దుర్గమ్మే చెప్పినట్లు అనిపించింది.. అందుకే

Oct 18 2019 12:21 PM | Updated on Oct 18 2019 2:07 PM

Police Rescued Man Who Attempts Suicide At Prakasam Barrage - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌ పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సింహాద్రి అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. దీంతో అతడు క్షేమంగా బయటపడ్డాడు. అనంతరం సింహాద్రి మాట్లాడుతూ.. ఇంటి యజమాని వేధింపులు భరించలేక నదిలోకి దూకి చనిపోదామనుకున్నట్లు తెలిపాడు. అయితే నీళ్లలో కొట్టుకుపోతున్న సమయంలో తన కాళ్లకు ఇసుక దిబ్బలు తగిలాయని.. దాంతో దుర్గమ్మ బతకాలని చెప్పినట్టు భావించానని పేర్కొన్నాడు. అందుకే చేతులు పైకెత్తి అరిచానని.. ఈ క్రమంలో తన కేకలు విన్న పోలీసులు బోటులో వచ్చి రక్షించారని వెల్లడించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement