ఆ నేత అరెస్టుకు మీనమేషాలెందుకు? | police hesitate to arrest murder case accused in ysr district | Sakshi
Sakshi News home page

ఆ నేత అరెస్టుకు మీనమేషాలెందుకు?

Apr 21 2015 5:29 PM | Updated on Jul 30 2018 8:41 PM

ఆ నేత అరెస్టుకు మీనమేషాలెందుకు? - Sakshi

ఆ నేత అరెస్టుకు మీనమేషాలెందుకు?

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నగిరిగుట్టకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నగిరిగుట్టకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితులుగా మల్లికార్జునరెడ్డి, అతని అల్లుడు ప్రమోద్, కుమార్తె షర్మిల, కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణయాదవ్, అతని అనుచరులను పోలీసులు చేర్చారు. సతీష్‌కుమార్‌రెడ్డి తన పెట్రోలు బంకు దగ్గర అదృశ్యం అయిపోయి.. తర్వాత ఎలా హతమయ్యారన్న విషయంపై ఆయన సోదరుడు హరనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ హత్య కేసులో బాలకృష్ణ యాదవ్ పై బలమైన సాక్ష్యాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితులెవరు దొరకడం లేదంటూ బాలకృష్ణ యాదవ్ అరెస్టుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. బాలకృష్ణ యాదవ్ మాత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement