తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనం | Police finds a Gun and Bullets in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనం

Aug 2 2017 9:50 AM | Updated on Aug 21 2018 6:00 PM

తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనం - Sakshi

తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనం

తిరుమల అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో బుల్లెట్లు, పిస్టల్‌ లభ్యమవ్వడం కలకలం రేపింది.

తిరుపతి: తిరుమల అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో బుల్లెట్లు, పిస్టల్‌ లభ్యమవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణే రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనంలో నలుగురు తిరుమలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో ఆ కారులో 14 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్‌ను విజిలెన్స్‌ అధికారులు గమనించారు.
 
వాటిని స్వాధీనం చేసుకుని వాహనంలోని వారిని ప్రశ్నించగా తమ వారు కొండపైన ఉన్నారంటూ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. వీరు వేటగాళ్లు.. లేక దోపిడి దొంగలన్న అయ్యింటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement