'పనులు చేయాలంటూ ఎవరు ఢిల్లీ రావద్దు' | Please don't come any one delhi for work, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'పనులు చేయాలంటూ ఎవరు ఢిల్లీ రావద్దు'

Jun 7 2014 1:15 PM | Updated on Mar 29 2019 9:24 PM

కష్టపడేవారికే పార్టీలో స్థానం ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

విజయవాడ : కష్టపడేవారికే పార్టీలో స్థానం ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తమకు పనులు చేసి పెట్టాలంటూ ఎవరూ ఢిల్లీ రావద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ జారీ చేయడంలో ఎలాంటి తప్పులేదని వెంకయ్య అన్నారు.

 

సీమాంధ్రకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనను బీజేపీ ఎప్పుడు తప్పుపట్టలేదని...విభజన జరిగిన తీరును మాత్రమే తప్పు పట్టామని వెంకయ్య నాయుడు అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement