కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులు సెంట్రల్ జోన్ యూనివర్సిటీ పోటీల్లో రాణించాలని కేయూ స్పోర్ట్స్ బోర్డు సె క్రటరీ, ప్రొఫెసర్ దిగంబరరావు ఆకాంక్షించారు.
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులు సెంట్రల్ జోన్ యూనివర్సిటీ పోటీల్లో రాణించాలని కేయూ స్పోర్ట్స్ బోర్డు సె క్రటరీ, ప్రొఫెసర్ దిగంబరరావు ఆకాంక్షించారు. క్రీడాకారులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటి కేయూ పే రు నిలబెట్టాలని సూచించారు. ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు సెంట్రల్ జోన్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు శనివారం కేయూ వాలీబాల్ మహిళల జట్టు... పురుషుల, మహిళల షటిల్ బ్యాడ్మింటన్ జట్లు ఒడిశాకు తరలివెళ్లారుు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి దిగంబరరావు మాట్లాడారు. క్రీడాపోటీల్లో రాణించే విద్యార్థులకు యూనివర్సిటీ అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ పోటీల్లో కేయూ జట్లకు కోచ్, మేనేజర్‌గా సింగరేణి ఉమెన్స్ కళాశాల పీడీ సావిత్రి వ్యవహరించనున్నట్లు వెల్లడించారు.
సెంట్రల్ జోన్ పోటీలకు తరలిన జట్లు ఇవే...
వాలీబాల్ (మహిళలు) : బి.జ్యోత్స్న, స్వప్న (యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల), జానకి (ఏఎస్‌ఎం కళాశాల-వరంగల్), పూర్ణ (ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల), శ్వేత(యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల-కొత్తగూడెం), నాగస్వరూప (ఎస్‌సీడబ్ల్యూ కళాశాల-కొత్తగూడెం), మౌనిక(ఎల్‌బీ కళాశాల-వరంగల్), ఎం.స్వప్న (కేడీసీ-హన్మకొండ), తేజస్వి, లక్ష్మి(కిట్స్ కళాశాల-వరంగల్), అరుణకుమారి (జీడీసీ-ఇల్లెందు), శోభారాణి (జీడీసీ-ఖమ్మం)
బ్యాడ్మింటన్ (పురుషులు) : సందీప్ (అరోరా కళాశాల-వరంగల్), అఖిలేష్‌కుమార్, హ్యాపీ వినోద్( కేఎండీసీ-ఖమ్మం), కె.సతీష్, భాస్కర్ (న్యూసైన్స్ కళాశాల), ఎండీ.ఖాదర్‌పాషా(జీడీసీ-మరిపెడ), సిద్దార్థ (కిట్స్ కళాశాల)బ్యాడ్మింటన్ (మహిళలు) : స్రవంతి, హిమబిందు (కిట్స్ కళాశాల), శ్యామ్‌భాను (కేఎండీసీ-ఖమ్మం), దివ్య, శ్రావ్య (ఎస్‌సీడబ్ల్యూ-కొత్తగూడెం).