రూ.9 కోట్ల పురుగుల మందులు పట్టివేత


కర్నూలు : అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ. 9 కోట్ల విలువైన పురుగుల మందులను వ్యవసాయశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీలో పురుగుల మందులను అక్రమంగా నిల్వ చేసి వాటిని కల్తీ చేసి అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top