చంద్రబాబును నిలదీసే రోజులొస్తున్నాయి | peoples are supdt to chandra babu will come soon | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నిలదీసే రోజులొస్తున్నాయి

Sep 19 2014 2:24 AM | Updated on Oct 1 2018 2:03 PM

చంద్రబాబును నిలదీసే రోజులొస్తున్నాయి - Sakshi

చంద్రబాబును నిలదీసే రోజులొస్తున్నాయి

‘‘చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు, చెల్లెమ్మలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

 * వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* ఆయన మోసాన్ని రైతులు, చెల్లెమ్మలే ప్రశ్నిస్తారు
* రుణ మాఫీపై రోజుకో మాట.. తాజాగా పింఛన్లలో కోత

 
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు, చెల్లెమ్మలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీ అంశంపై రోజుకో మాట మారుస్తూ వస్తున్న చంద్రబాబు.. తాజాగా పింఛన్లలో కోతలకు సిద్ధమవుతున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల సంఖ్యను భారీగా తగ్గించడం, ఆ ఇచ్చే పింఛన్లు కూడా పచ్చ చొక్కాలకే అందేలా విధివిధానాలు రూపొందిస్తున్నాడు.
 
*ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా సక్రమంగా నెరవేర్చని చంద్రబాబు మోసపూరిత వైఖరిని రైతులు, చెల్లెమ్మలు నిలదీసే రోజులొస్తున్నాయి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గాల వారీగా రెండు రోజుల సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు గురువారం ఉదయం ఆయన నగరానికి చేరుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారిలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో గురువారం మొదలైన సమీక్ష సమావేశం ప్రారంభంలో జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..
 
* చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఈ రోజు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడి బాబు ప్రజా వ్యతిరేక చర్యలపై ముందుండి పోరాడాలి.

* ఎన్నికల్లో బాబు కూటమికి, మనకి తేడా దాదాపు ఐదు లక్షల ఓట్లు మాత్రమే. గడిచిన కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో నాకు వచ్చిన మెజార్టీనే 5.45 లక్షల ఓట్లు. ఈ మెజార్టీతో పోల్చుకుంటే చంద్రబాబు కూటమికి రాష్ర్టవ్యాప్తంగా వచ్చిన ఓట్లు పెద్దలేక్కేమీ కాదు. నేనూ చంద్రబాబులా అబద్ధపు మాటలు చెప్పి ఉంటే.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండేది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారు. ఎలాగోలా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నాడు. గ్రామాల్లోకెళ్తే రైతులు, అక్కచెల్లెళ్లు నిలదీస్తున్నారు. తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.

* పింఛన్లను కత్తిరించడానికి చంద్రబాబు జీవో 135ను కొత్తగా తయారుచేశారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఇతర పింఛన్లకు సంబంధించి 43,11,668 మంది లబ్ధిదారులు ఉన్నారు. పింఛన్ మొత్తం పెంచడానికి రూ. 3,700 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1300  కోట్లు కేటాయించారంటే దాని అర్థం రూ. 2,400 కోట్లు కోత విధించడమే. ఈ పింఛన్ల లబ్ధిదారులపై కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో టీడీపీ వారికి మాత్రమే స్థానం కల్పిస్తుండటం మరో దారుణం. టీడీపీ శ్రేణులకే ఫించన్లు వచ్చే మాదిరి గా బాబు మాయోపాయాలు పన్నుతున్నాడు.

* జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలంటూ మాట మారుస్తున్నాడు.

 బాబు మాటలతో మోసపోయిన రైతన్నలు
* రైతులకు సంబంధించి రూ.87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తానని తన మోసపూరిత మాటలతో చంద్రబాబు కొద్దో గొప్పో రైతులను నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతన్నలు నేడు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్‌లో వారికి బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలకు 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. మరోవైపు పంటల బీమా అం దని పరిస్థితి. డ్వాక్రా మహిళల పొదుపు నుంచి సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. ఇంత దారుణంగా బాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement