రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: నాగిరెడ్డి

YSRCP Leader Nagi Reddy Fires Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస, నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షర భారత్ సమన్వయ కర్తలుగా పనిచేసే 20,500ల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఉందని మండిపడ్డారు. అన్యాయంగా ఉద్యోగులను తొలగించడం చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. 

బాబు పాలనలో సాగు తగ్గుతోంది..
ముంఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో సాగి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకుల్లో తనఖా పెడుతోందని తెలిపారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెట్టిన పరిస్థితి, దుస్థితి దేశ చరిత్రలోనే లేదని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సోమశీల, వంశాధార, వెలుగొండ, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టులు, ఎస్‌ఆర్‌ఎస్‌సీ ప్రాజెక్టులను బ్యాంక్‌లలో తాకట్టు పెడుతోందన్నారు. 
ఇప్పటికే బాబు ప్రభుత్వం ప్రాజెక్టులను తానఖా పెట్టి 3 వేల కోట్లు రుణాలు తీసుకుంది.. మళ్లీ ఇప్పుడు 10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. 

ప్రపంచానికి పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న వ్యక్తినని చెప్పుకున్న చంద్రబాబు ఇలాంటి పాలన సాగించడం సిగ్గుచేటని నాగిరెడ్డి పేర్కొన్నారు. బాబు ఖరీఫ్ సీజన్‌లో 2 కోట్ల ఎకరాలకు నీరు అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు మెట్ట, సాగునీటి ప్రాంతాల భూమి మొత్తం కలిపి కనీసం కోటి ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలిపారు.ఇంత నీటి కొరత ఉంటే రైతులు ఏ విధంగా పంటలు పండించగలరని ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top