పింఛన్‌దారుల అవస్థలు | Sakshi
Sakshi News home page

పింఛన్‌దారుల అవస్థలు

Published Sat, Oct 12 2013 2:59 AM

Pensioner's face problems

మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌లైన్‌ :జిల్లాలోని మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఐదో తేదీ వరకు పంపిణీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు 55 శాతం మాత్రమే పంపిణీ చేశారు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద పింఛన్‌దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు ఐదారు రోజులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పండుగ పూట తొందరగా డబ్బులు వస్తే ఆసరా ఉంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. అధికారుల నిర్లక్ష్యంతో దసరా పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పింఛన్‌దారులు పేర్కొంటున్నారు.

కాగా, మున్సిపాలిటీ సిబ్బంది పింఛన్‌ డబ్బులను వార్డుల్లో పంపిణీ చేసేవారు. ప్రతినెలా ఐదో తారీఖు వరకు ఒక్కో వార్డులో ఒక్కో సిబ్బంది వెళ్లి పంపిణీ సజావుగా చేసేవారు. సిబ్బందికి భారం పడుతుందని, బోగస్‌ పింఛన్‌దారులను ఏరివేయాలని ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు మేలో అప్పగించింది. ఈ సంస్థ నిర్వాహకులు స్మార్‌‌ట కార్డు అందజేసి, వేలి ముద్రలు తీసుకుని వాటి ఆధారంగానే పింఛన్‌ పంపిణీ మొదలెట్టారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలతో పింఛన్‌ అందడం లేదు.

పంపిణీ 55 శాతమే.. మంచిర్యాల పురపాలక సంఘంలో 5వేల పైచిలుకు పింఛన్‌దారులు ఉండగా రూ. 17 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రూ. 9 లక్షలు మాత్రమే పంపిణీ చేశా రు. కాగజ్‌నగర్‌ పురపాలక సంఘంలో 4 వేల పైచిలుకు లబ్ధిదారులు ఉండగా రూ. 12.50 లక్షలు పంపిణీ చేయాల్సి ఉండగా రూ.6లక్షలు పంచారు. బెల్లంపల్లిలో 4 వేల మంది లబ్ధిదారులకు రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ.7 లక్షలు, మందమర్రిలో 3,800 మందికి రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ. 6.50 లక్షలు పంపిణీ చేశారు.

అలాగే ఆదిలాబాద్‌ పురపాలక సంఘంలో సుమారు 6 వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.17 లక్షలలో రూ.10.50 లక్షలు, నిర్మల్‌లో 7వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.20 లక్షలకు రూ.12 లక్షలు పంపిణీ చేశారు. భైంసాలో 4 వేల మంది పింఛన్‌దారులకు రూ.8లక్షలు పంచాల్సి ఉండగా రూ.5లక్షలు పంపి ణీ చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గణాంకాలు పరిశీలిస్తే 55 శాతం మందికి మాత్రమే పింఛన్‌ అందినట్లు స్పష్టమవుతోంది. కాగా, కాంట్రాక్‌‌ట సంస్థ మేనేజర్‌ అమ్జద్‌ఖాన్‌ను అడుగగా 18వ తేదీలో పింఛన్‌లు మొత్తం పంపిణీ చేస్తామని తెలిపారు.

పింఛన్‌ కోసం వచ్చి వృద్ధురాలు మృతి
కాగజ్‌నగర్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌ : కాగజ్‌నగర్‌ రైల్వేస్టే„షన్‌లో పింఛన్‌ కోసం వచ్చి వృద్ధురాలు మృతిచెందిన సంఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. జీఆర్‌పీ ఇన్‌చార్జి రశీ ద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ ప ట్టణానికి చెందిన కోట గాలమ్మ కుటుంబం ప్ర స్తుతం దండేపల్లి మండలం తాళ్లపేటలో ఉం టోంది. గాలమ్మ ప్రతినెలా కాగజ్‌నగర్‌కు వ చ్చి వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంటోంది. ఈనెల పింఛన్‌ తీసుకోవడానికి గురువా రం కాగజ్‌నగర్‌కు వచ్చింది.

పింఛన్‌ తీసుకున్న అనంతరం బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం భాగ్యనగర్‌ ఎక్‌‌సప్రెస్‌లో వెళ్లేందుకు సిద్ధమైంది. రైలు వెళ్లిపోవడంతో రాత్రి కాగజ్‌నగర్‌ రైల్వేస్టే„షన్‌లో నిద్రించింది. శుక్రవారం వేకువజామున రైల్వే సిబ్బంది లేపగా మృతిచెంది ఉంది. స్టేషన్‌మాస్టర్‌ మల్లయ్య ఫిర్యా దు మేరకు జీఆర్‌పీ బెల్లంపల్లి ఔట్‌పోస్టు ఇన్‌చార్జి నందగోపాల్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటుందని సిబ్బంది తెలిపారు.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా..
నా పేరు రాజుబాయి. మాది నిర్మల్‌ మండలం పింజారిగుట్ట. ప్రభుత్వం ఇచ్చే రూ.200 పింఛన్‌ డబ్బుల కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా. రోజూ ఆటోలో వస్తున్నా. రావడానికి పోవడానికే ఇప్పటివరకు రూ.50 ఖర్చయ్యాయి. తిండి తిప్పలు ఉండటం లేదు. ఇక్కడ వసతులు లేక అవస్థలు పడుతున్నాము. ఇప్పటివరకు పింఛన్‌ తీసుకోలేదు.

అరిగోస పెడుతున్నారు..
పింఛన్‌ల కోసం అరిగోస పెడుతున్నారు. ప్రతినెలా పింఛన్‌ కోసం తండ్లాడుతున్నాను. ఎప్పుడిస్తారనేది దేవునికే తెలియాలి. మేము మాత్రం నడవరాకున్నా అష్ట కష్టాలు పడి పింఛన్‌లు ఇచ్చే చోటుకు వెళ్తాము. గంటల తరబడి నిరీక్షించిన తర్వాత రేపు రండి అంటూ ఇంటికి పంపిస్తారు. కనీసం పండుగ పూట అయినా ముందుగా ఇస్తే సంతోషించే వాళ్లం.
 - సత్యనారాయణ, పింఛన్‌దారుడు, హమాలీవాడ, మంచిర్యాల
 

Advertisement
 
Advertisement
 
Advertisement