దోమలపై దండయాత్రతో దోచింది మర్చిపోయారా? | Palakollu YSRCP Incharge Kavuru Srinivas Press Meet | Sakshi
Sakshi News home page

దోమలపై దండయాత్రతో దోచింది మర్చిపోయారా?

Oct 12 2019 4:42 PM | Updated on Oct 12 2019 4:45 PM

Palakollu YSRCP Incharge Kavuru Srinivas Press Meet - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ పాలనలో డ్రైనేజీలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం వ్యాధులు ప్రబలుతున్నాయని పాలకొల్లు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి కవురు శ్రీనివాస్‌  తెలిపారు. దోమలపై దండయాత్ర పేరుతో నిధుల దోపిడీ చేయడం తప్ప ఒక్క పనీ చేయలేదని ఆయన మండిపడ్డారు. శనివారం స్థానికంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌ కార్యక్రమంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తూ రూ. 25 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు చేసిన తప్పులను ప్రజల్లో ఎండగడతామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు యడ్ల తాతాజీ మాట్లాడుతూ.. గతంలో చేసిన అవినీతి, తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే డ్రామాలాడుతున్నాడని పేర్కొన్నారు. పర్సంటేజీలు వచ్చే పనులకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన పనులను మరుగున పడేయడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement