 
															ఆపరేషన్ వెల్ డన్
తిరుమలలో శనివారం ఫైర్ విభాగం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించింది...
	- బావిలో పడిన వ్యక్తిని రక్షించిన ఫైర్ సిబ్బంది
	- ఆందోళనకరంగా బాధితుడి ఆరోగ్యం
	సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం ఫైర్ విభాగం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించింది. బావిలో పడిన సామగ్రి పైకి ఎత్తేందుకు వెళ్లి పైకిరాక జారిపడిన వ్యక్తిని ప్రాణాలతో రక్షించారు. ఆలయ ఉత్తరమాడ వీధిలో అహోబిలం మఠం  లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 120 అడుగుల బావి ఉంది. అందులో పడేసిన వస్తు సామగ్రి కోసం సికింద్రాబాద్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శంకర్ (32) తాడు, నిచ్చెన సాయంతో దిగాడు. సామగ్రిని పైకి చేర్చాడు. తిరిగి పైకి వస్తూ జారి బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారంతో ఫైర్ సిబ్బంది రాజా, శేఖర్ సంఘటన స్థలికి చేరుకుని బావిలోకి దిగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న శంకర్‌ను పైకి తీసుకొచ్చారు. శంకర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం రుయా ఆస్పత్రికి తరలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
