కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి | One dies in Coromandel fertilizers factory due to cylinder explosion | Sakshi
Sakshi News home page

కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి

Nov 22 2015 2:04 PM | Updated on Sep 3 2017 12:51 PM

కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

కాకినాడ రూరల్ (తూర్పు గోదావరి) : కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఆదివారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కూలీగా పని చేస్తున్న లోవరాజు(27) సిలిండర్లలో కెమికల్ మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అమోనియం గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడికక్కడే మృతిచెందగా .. సమీపంలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement