అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్.. | One arrested for Illegal gas refilling | Sakshi
Sakshi News home page

అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్..

May 21 2015 7:59 PM | Updated on Sep 3 2017 2:27 AM

అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

జీడిమెట్ల (హైదరాబాద్) : అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పద్మానగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండే సుబ్బారావు(50) అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు గురువారం దాడి చేసి అతని వద్ద నుండి మూడు పెద్ద సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుబ్బారావును పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement