కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు.
విశాఖపట్నం: కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు. అక్కయ్యపాలెం అబిద్ నగర్లో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు రిటైర్డ్ రైల్వే హెడ్ నర్సు ఆండాలమ్మ పీక నొక్కి హత్య చేసి, ఆమె మెడలోని నగలను తీసుకువెళ్లారు.
విషయం తెలిసిన వెంటనే నాలుగవ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.