నాలుగేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం | OLAVARAM four years purticestam | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం

Aug 24 2015 1:23 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

కాకినాడ సిటీ : పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంత్యుత్సవాన్ని అధికారికంగా స్థానిక జిల్లాపరిషత్ సెంటర్‌లోని అమర్ జవాన్ పార్కులో ఉన్న ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవినేని మాట్లాడుతూ ఆంధ్రకేసరి స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, మాజీ ఎమ్మెల్యేలు పర్వత చిట్టిబాబు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 
 వచ్చే నెలలో నీటి సంఘాలకు ఎన్నికలు
 కాకినాడ సిటీ : పథకాల అమల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వచ్చేనెల మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో  కలెక్టర్ అరుణ్‌కుమార్, జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
 ప్రజాసంక్షేమమే టీడీపీ ధ్యేయం
 కాకినాడ సిటీ : ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆది వారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి దేవినేనితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజప్ప, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement