'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు' | october 22 is inauguration for capital region | Sakshi
Sakshi News home page

'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'

Jun 17 2015 10:21 PM | Updated on Sep 3 2017 3:53 AM

'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'

'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'

నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు.

హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటివరకూ 21,500 ఎకరాలకు అగ్రిమెంట్లు కుదిరాయని ఆయన చెప్పారు. ఏ గ్రామంలో రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూములు ఇస్తామన్నారు.

హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ఆధారంగా భూ సమీకరణ మరింత సులభంగా సాగుతుందని మంత్రి పేర్కాన్నారు. ఒకవేళ భూములివ్వని రైతుల నుంచి..పంటలు పూర్తయ్యాక భూ సేకరణ చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement