అగ్రవర్ణాలకూ న్యాయం చేయండి | OC Sangharshana Samithi Demand Justice for Upper caste | Sakshi
Sakshi News home page

అగ్రవర్ణాలకూ న్యాయం చేయండి

Jun 3 2014 5:36 PM | Updated on Sep 2 2017 8:16 AM

విద్య, ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణాలకు జరుగుతున్న అన్యాయంపై ఒ.సి. సంఘర్షణ సమితి పోరాడుతుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సింగం సదాశివరెడ్డి చెప్పారు.

విజయవాడ : విద్య, ఉద్యోగ  రంగాల్లో అగ్రవర్ణాలకు జరుగుతున్న అన్యాయంపై ఒ.సి. సంఘర్షణ సమితి పోరాడుతుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సింగం సదాశివరెడ్డి చెప్పారు. విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్లే అగ్రవర్ణాలకు చెందిన ప్రతిభావంతులకు అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఒ.సి.లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని కోరారు. 10 న్యాయమైన డిమాండ్లతో సమితి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో విజయవాడలో సీమాంధ్ర ఒ.సి. మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో శివప్రసాద్‌రాయల్, సాంబిరెడ్డి, సుభాన్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎం.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement