breaking news
OC Sangharshana Samithi
-
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్ : అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో ఓసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, వెలమలకు రిజర్వేషన్లు కల్పించాలని, నిరుపేద విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని సంఘర్షణ సమితి డిమాండ్ చేసింది. సంఘర్షణ సమితి చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే అగ్రవర్ణాలని జీవనం దుర్భరంగా మారిందన్నారు. పూట గడవని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రభుత్వాలు అగ్రవర్ణాలన్న నెపంతో పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించివారిని ఆదుకోవాలని కోరారు. తాము ఏ ఇతర కులానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అగ్రవర్ణపేదలకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన విద్యార్థులకు ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు మాదిరి విదేశీ విద్యను అందించాలన్నారు. విదేశీ విద్యకు హామీలేని రుణాలు అందించాలని ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓసి కార్పొరేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీని అమలు చేయాలని కోరారు. సిన్హో కమిషన్ నివేదికను అమలు చేసి 80శాతంగా ఉన్న అగ్రవర్ణ పేదలకు అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. ధర్నాలో ఓసి సంఘర్షణ సమితి జిల్లా అ«ధ్యక్షుడు చక్కా రాజావరప్రసాద్, నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి, పుజారి దుర్గారావు, ఆనంద్, విశ్వనాథ రవి, టీవీకే శాస్త్రి, సయ్యద్ రఫీ, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణాలకూ న్యాయం చేయండి
విజయవాడ : విద్య, ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణాలకు జరుగుతున్న అన్యాయంపై ఒ.సి. సంఘర్షణ సమితి పోరాడుతుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సింగం సదాశివరెడ్డి చెప్పారు. విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్లే అగ్రవర్ణాలకు చెందిన ప్రతిభావంతులకు అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఒ.సి.లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని కోరారు. 10 న్యాయమైన డిమాండ్లతో సమితి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో విజయవాడలో సీమాంధ్ర ఒ.సి. మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో శివప్రసాద్రాయల్, సాంబిరెడ్డి, సుభాన్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎం.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.