ఏపీ: స్కూల్‌ ఫీజు వసూలుపై కీలక ఆదేశాలు | No Hike Fees In Private Schools And Colleges In AP | Sakshi
Sakshi News home page

గతేడాది ఫీజులే వసూలు చేయాలి

Apr 23 2020 4:03 PM | Updated on Apr 23 2020 5:05 PM

No Hike Fees In Private Schools And Colleges In AP - Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిల్లోనూ పలు యాజమాన్యాలు మాత్రం ఫీజులు  కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.

అది కూడా మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement