
పార్వతీపురం: పార్వతీపురం ఏస్పీగా ఎం.దీపికను నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్‌పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ ఏస్పీగా విధులు నిర్వర్తించిన అమిత్ బర్దార్ విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీపిక విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం పార్వతీపురం ఏస్పీగా విధుల్లో చేరిన అమిత్‌బర్దార్‌కు ఇంత త్వరగా బదిలీ కావడం విశేషం.