
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పదవులకు కీలక నియామకాలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయం శనివారం ప్రకటనలు విడుదల చేసింది. రాష్ట్ర కార్యదర్శిగా చెల్లెం ఆనంద్ ప్రకాశ్(పాలకొల్లు నియోజక వర్గం ) నియమించినట్లు తెలిపింది.
వీటితోపాటు ఎన్నారై విభాగం కేంద్ర కార్యాలయ సమన్వయకర్తగా గుంటూరుకు చెందిన అన్నపురెడ్డి హర్షవర్థన్ రెడ్డిని నియమించినట్లు తెలిపింది. అనంతపురం, కృష్ణా జిల్లాలకు చెందిన వారికి కీలక బాధ్యతలను అప్పజెప్పింది. మడకశిర నియోజకవర్గానికి గానూ రూరల్ మండల్ ప్రెసిడెంట్‌గా ఎస్ రామిరెడ్డిని నియమించినట్లు పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేసింది.