'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం'

బండారు మాధవనాయుడు(ఫైల్ ఫోటో)


నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆవరణలో షాపులు ఖాళీచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్‌ అసోసియేషన్ ఆరోపించింది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని మండిపడింది. జడ్జిని ఏకవచనంతో సంబోధించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది.ఎమ్మెల్యే దౌర్జన్యానికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరిస్తున్నామని బార్‌ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి బాబ్జి తెలిపారు. అయితే జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే మాధవనాయుడు వివరణయిచ్చారు. ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జడ్జి అని తనకు తెలియదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top