రెండేళ్లుగా ఆగిన సాగర్ ఆధునీకరణ | Nagarjuna sagar modernization stopped for 2 years | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ఆగిన సాగర్ ఆధునీకరణ

Jan 14 2014 5:59 AM | Updated on Oct 19 2018 7:19 PM

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జునసాగర్ ఆధునీకరణకు సంబంధించి వెయ్యికోట్ల పనులు నిలిచిపోయాయి. నీటి యాజమాన్య సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పనులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జునసాగర్ ఆధునీకరణకు సంబంధించి వెయ్యికోట్ల పనులు నిలిచిపోయాయి. నీటి యాజమాన్య సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పనులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతున్నది. సాగర్ నుంచి విడుదల అయ్యే ప్రతి నీటిచుక్క పొలాలకు వెళ్లడానికి వీలుగా ఆధునీకరణను ఆరంభించిన విషయం తెలిసిందే. రూ.4,444 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు రూ.2,025 కోట్ల రుణంగా ఇచ్చింది. మిగిలిన నిధులను రాష్ర్ట ప్రభుత్వం భరిస్తున్నది.
 
 ఆధునీకరణలో భాగంగా మెయిన్, బ్రాంచి కెనాళ్లు, డిస్ట్ట్రిబ్యూటరీలతో పాటు చిన్న కాల్వలకు మరమ్మతు పనుల్ని చేస్తున్నారు. ఈ పనులు 2016 జూన్‌లోపు పూర్తికావాలి. అయితే ఇప్పటి వరకు రూ.1,350కోట్ల పనులే జరిగాయి. చిన్న కాల్వల మరమ్మతుకు వెయ్యి కోట్ల విలువైన 670 టెండర్లను పిలవాల్సి ఉంది. వీటిని ఖరారు చేయాలంటే రైతు సంఘాల ప్రతినిధులుండాలి. ఎన్నికలు జరగకపోవడంతో ఆ ప్రతినిధులు లేరు. దాం తో టెండర్లను ఖరారు చేయలేకపోతున్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు 17, 18వ తేదీల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నీటిపారుదల అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement