'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు' | "My son did not make any mistake ' | Sakshi
Sakshi News home page

'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు'

Sep 25 2014 3:28 PM | Updated on Aug 17 2018 7:54 PM

మీడియాతో మాట్లాడుతున్న ఇంద్రావతి - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఇంద్రావతి

తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని, అలిపిరి ఘటనలో శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి తల్లి ఇంద్రావతి వాపోయారు.

తిరుపతి: తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని, అలిపిరి ఘటనలో శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి తల్లి ఇంద్రావతి వాపోయారు. సమాజంలో అరాచకాలు చూసి తట్టుకోలేకనే తన కుమారుడు రెండేళ్లపాటు నక్సలైట్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. పది సంవత్సరాల క్రితమే నక్సలైట్ బాట వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు.

రామ్మోహన్ రెడ్డి  టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లలో పనిచేసినట్లు వివరించారు.  విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. తన కుమారుడు ఎప్పటికైనా నిర్దోషేనని ఇంద్రావతి అన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement