భర్తతో కలిసి ఆనందంగా జీవిస్తున్న తమను అత్తమామలు వేరు చేశారు... లేనిపోని మాటలు చెప్పి దూరం చేశారు..
మీడియా ముందు
ఓ వివాహిత వేడుకోలు
శ్రీకాకుళం సిటీ: భర్తతో కలిసి ఆనందంగా జీవిస్తున్న తమను అత్తమామలు వేరు చేశారు... లేనిపోని మాటలు చెప్పి దూరం చేశారు.. నా భర్తను దగ్గరకు చేర్చాలంటూ ఓ వివాహిత మీడియా సాక్షిగా వేడుకుంది. పట్టణంలోని ఇలిసిపురానికి చెందిన పొట్నూ రు పావని గతనెల 26న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం పాఠకులకు తెలిసిందే. తను ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను పేర్కొంటూ గతనెల 31న రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.
జైపూర్‌కు చెందిన సందీప్‌కుమార్‌తో తనకు గతేడాది వివాహం జరిగింది. తొలత కాపురం కొద్దినెలల పాటు బాగానే ఉన్నా తన మామ నారాయణశెట్టి ఆనందరావు, అత్త ఆశాజ్యోతి, ఆడపడుచు సౌమ్యలు కలిసి తనను గృహనిర్భందం చేయడం, అసభ్యకరమైన సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేశారు. దీంతో గతేడాది చెన్నైలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాను. తనపై లేనిపోని కల్పితాలను భర్తకు చెప్పి తమను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టినా ఫలితం లేకపోయింది. తన కుటుంబ సభ్యులు విదేశీపర్యటలో ఉన్న సమయంలో గతనెల 26న పుట్టింటికి చేరుకున్నాను. అయినప్పటికీ అత్తవారి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో మళ్లీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానని వాపోయింది. పోలీసులు స్పందించి భర్తను దగ్గరకు చేర్చుకోవాలని వేడుకుంది.