ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ | MP Mithun Reddy inquiry | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ

Jan 23 2016 3:49 AM | Updated on Aug 21 2018 5:52 PM

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు

♦ సాయంత్రం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు
♦ రిమాండ్ విధించిన కోర్టు... నెల్లూరు జైలుకు తరలింపు
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి/నెల్లూరు(క్రైమ్):
  రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకునివిచారించారు. రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే. వారిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి శ్రీకాళహస్తి కోర్టు అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11.30 సమయంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు నెల్లూరు జిల్లా కేంద్రకారాగారం నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసుస్టేషన్‌లో  రెండు గంటలపాటు విచారించారు.
 మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం సాయంత్రం ఎంపీ మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలకు పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్  కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో వారిద్దరినీ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement