ప్రధానికి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి లేఖ

MP Avinash Reddy Wrote A letter To PM Modi - Sakshi

సాక్షి, కడప : యూరేనియం టైల్‌పాండ్‌ వ్యర్థాల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖ రాశారు. టైల్‌ పాండ్‌ వ్యర్థాల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే పంటలు, పశు సంపద సైతం దెబ్బతింటోందని, ఈ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ప్రధాన మంత్రికి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందించాలని కోరారు. యూసీఐఎల్‌ సీఎండీ త్వరగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top