కొడుకును చంపించిన తల్లిదండ్రులు | Mother, father 'confesses'.. behind murdering their son | Sakshi
Sakshi News home page

కొడుకును చంపించిన తల్లిదండ్రులు

Apr 27 2015 10:03 AM | Updated on Jul 30 2018 9:21 PM

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

తొట్టంబేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగుడుకు బానిసై డబ్బుకోసం తల్లిదండ్రలని వేధిస్తున్న కోడుకును...కన్న తల్లిదండ్రులే పథకం ప్రకారం హత్య చేయించారు. ఈ సంఘటన తొట్టెంబేడు మండలం దిగువ సాంబయ్యపాల్యంలో జరిగింది.

వివరాల్లోకి వెలితే...దిగువసాంబయ్య పాల్యంకి చెందిన మునికృష్ణ దంపతులు తమ కుమారుడు రాంబాబు (22)తో కలసి 10 ఏళ్ల క్రితమే తిరుపతిలో స్థిరపడ్డారు. మునికృష్ణ టీటీడీ సులభ్ కాంప్లెక్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  కాగా, ఆదివారం దిగువ సాంబయ్యపాల్యంలో ఉండే తన తండ్రి వద్దకు మునికృష్ణ, రాంబాబుతో కలసి వెళ్లాడు. సాయంత్రం తన తండ్రి పనిచేసే ఎంజీఎం క్రషర్ వద్దకు వెళ్లి వద్దామంటూ మునికృష్ణ తన కుమారుడ్ని వెంట తీసుకుని వెళ్లాడు. అర్ధరాత్రికి రాంబాబు అక్కడ శవమై కనిపించాడు. మరోవైపు యువకుడి తల్లిదండ్రులు... తామే కొడుకును హత్య చేయించామని శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement