రేపటి నుంచి మదర్ డెయిరీ పాల ధర పెంపు | Mother Diary hikes milk prices | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మదర్ డెయిరీ పాల ధర పెంపు

Sep 1 2013 3:31 AM | Updated on Sep 1 2017 10:19 PM

మదర్ డెయిరీ పాల ధరను సోమవారం నుంచి పెంచుతున్నట్లు డీజీఎం రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచామని ఆయన వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: మదర్ డెయిరీ పాల ధరను సోమవారం నుంచి పెంచుతున్నట్లు డీజీఎం రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు టీఎం పాలను లీటరుకు రూ.34 చొప్పున విక్రయిస్తుండగా సోమవారం నుంచి రూ.36కు పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు డెయిరీలు ఇదివరకే పాల ధరను పెంచాయని, ఉత్పాదక వ్యయం పెరిగిన దృష్ట్యా తాము సైతం పాల ధరలను పెంచాల్సి వస్తోందని ఆయన వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement