కుటుంబ కలహాల నేపథ్యంలో కూతురు సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉపాధ్యాయనగర్‌లో సోమవారం జరిగింది.
వెంకటగిరి (నెల్లూరు) : కుటుంబ కలహాల నేపథ్యంలో కూతురు సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉపాధ్యాయనగర్‌లో సోమవారం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన పద్మావతి(25)కి శంకర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్ని రోజులుగా వీరి మధ్య కలహాలు జరుగుతుండగా.. సోమవారం పద్మావతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్న సమయంలో ఉపాధ్యాయనగర్ సమీపంలోని బావిలో మూడేళ్ల కూతురు నాగలక్ష్మీ సహా పద్మావతి శవమై తేలింది. రెండేళ్ల బాబు ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.