మత్స్య సంపద పెంచేందుకే వీటి ఏర్పాటు: మంత్రి

Mopidevi Venkataramana Talks In Press Meet Over Fishing Harbour In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: కేంద్రం సహకారంతో జువ్వలదిన్నె వద్ద రూ. 280 కోట్లతో ఫిషింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఫిషింగ్‌ హార్బర్లు, 8 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామన్నారు.  సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి)

తీరంలోని 9 జిల్లాల్లో మత్స్య సంసపదను పెంచేందుకే ఈ సెంటర్లను ఏర్పాటు అని ఆయన తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌‌ మాట్లాడుతూ.. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. మత్స్య, ఆక్వా రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.  ఫిషింగ్‌ హర్భర్‌కు అనుబంధంగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top