15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ | Money Transfer to start from 15th november for gas | Sakshi
Sakshi News home page

15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

Nov 8 2014 2:40 PM | Updated on Sep 2 2017 4:06 PM

గ్యాస్‌కు ఆధార్ లింకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనుంది.

ఒంగోలు : గ్యాస్‌కు ఆధార్ లింకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. 15వ తేదీ నుంచి డెలివరీ అయ్యే సిలిండర్లకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని శ్రీదేవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అయితే గతంలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమకు ఒక దరఖాస్తు అందజేయడంతోపాటు బ్యాంకుకు కూడా సంబంధిత సమాచారాన్ని తెలియజేస్తూ ఆధార్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement