'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు' | MLA srikanthreddy criticised AP govenment | Sakshi
Sakshi News home page

'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు'

Jul 23 2015 4:27 PM | Updated on May 29 2018 4:23 PM

'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు' - Sakshi

'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు'

గోదావరి పుష్కరాల నిర్వహణ పేరిట 30 మంది అమాయక ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలి తీసుకుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

కడప : గోదావరి పుష్కరాల నిర్వహణ పేరిట 30 మంది అమాయక ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలి తీసుకుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేస్తుందని, కేవలం ఆర్భాటాలకే పెద్దపెట వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు సమస్యలతో అల్లాడుతుంటే వేల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాల సినిమా తీస్తారా అని ఈ సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతాంగం నిర్వీర్వం కాకముందే వారిని ఆదుకోవాలని, ఎకరాకు రూ. 20 వేలు తక్కువ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement