ప్రజా ప్రతినిధులుగా గర్వపడుతున్నాం

MLA Chandrasekhar Reddy Said YSRCP Government Fully Implemented Manifesto Within Year - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

సాక్షి, కాకినాడ: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. ప్రజాప్రతినిధులుగా తాము ఎంతో గర్వ పడుతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీ వంగా గీత, పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మీ కేక్‌ కట్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించి.. మంచి మనస్సుతో సిఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హమీలను ఏడాది కాలంలోనే అమలు చేశారని పేర్కొన్నారు.
(టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది)

చారిత్రాత్మక విజయం అందించిన రోజు: వంగా గీత
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 52 శాతం ఓట్లతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి గొప్ప విజయం అందించిన రోజు అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా, కరోనా కష్టాలు వచ్చిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలోనే సీఎం అమలు చేశారని కొనియాడారు. సీఎం జగన్‌కు భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు
('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top