జగన్‌కు స్వల్ప అస్వస్థత | Minor illness to YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌కు స్వల్ప అస్వస్థత

Published Wed, May 30 2018 1:42 AM | Last Updated on Wed, May 30 2018 1:42 AM

Minor illness to YS Jagan - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు.

అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. రోజూ ఎండలోనే పాదయాత్ర చేస్తున్నందున ఆదివారం తమ అధినేత జగన్‌ వడదెబ్బకు గురయ్యారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement