ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వాస్తవమే:పేర్ని నాని

Minister Perni Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, మచిలిపట్నం: అమరావతి పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఉదయం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బినామీలతో భూములు కొనుగోలు చేయించారన్నారు. చంద్రబాబు ఊహజనిత కలల రాజధాని కట్టాలనుకున్నారని.. చంద్రబాబు నిర్ణయాలతో  కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

‘లక్ష కోట్ల మౌలిక వసతులు కల్పించినా 30 ఏళ్ల తర్వాతైనా.. హైదరాబాద్‌, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడే పరిస్థితి వస్తుందా.. ఒక్క ప్రాంతంలోనే లక్ష కోట్లు ఖర్చుచేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటి.. స్వయం సంవృద్ధి ప్రాంతమైతే వేల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు. ఏడాదికి రూ.570 కోట్ల వడ్డీ ఎందుకు చెల్లించారు’ అని పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఐదేళ్లలో కేవలం రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా సీఎం సానుకూలంగా స్పందిస్తారని తెలిపారు. కచ్చితంగా రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. అందరికీ సానుకూలమైన పరిష్కారమే ప్రభుత్వం చూపిస్తుందన్నారు. హెరిటేజ్‌తో తన కుమారుడు లోకేష్‌కు చంద్రబాబు సంపద సృష్టించారన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం ఏటీఎంలా మారిందని సాక్ష్యాత్తూ ప్రధానే చెప్పారని పేర్ని నాని  పేర్కొన్నారు.
(చదవండి: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిజమే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top