‘ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది’ | Minister Kurasala Kannababu Comments On Hyderabad Encounter | Sakshi
Sakshi News home page

‘ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది’

Dec 6 2019 2:22 PM | Updated on Dec 6 2019 2:40 PM

Minister Kurasala Kannababu Comments On Hyderabad Encounter - Sakshi

సాక్షి, కాకినాడ: ‘దిశ’ కేసులో ప్రజలు కోరుకున్న తీర్పే వెలువడిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో మహిళల రక్షణ, భద్రత చాలా ప్రధానమైందన్నారు. ఈ అంశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు. తీర్పులు, శిక్షలు చాలా కఠినంగా అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ‘దిశ’ ఘటన దేశాన్నే కుదిపేసిందన్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తప్పకుండా చట్టాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘సమాజంలో మహిళల పట్ల భక్తి అయినా ఉండాలి, ప్రభుత్వం మీద భయమైన ఉండాలి. ఈ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని’ అభిప్రాయపడ్డారు. ఏపీలో మహిళల భద్రత చాలా ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు. ఎటువంటి ఆపదలోనైనా పోలీస్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు, మహిళ, సైబర్‌ మిత్రలకు కాల్‌ చేయాలని మహిళలకు మంత్రి కన్నబాబు సూచించారు.
(చదవండి: నలుగురు మృగాళ్ల కథ ముగిసింది)

Advertisement
 
Advertisement
Advertisement