పెట్రోల్ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం | Merchant commits suicide attempt | Sakshi
Sakshi News home page

పెట్రోల్ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Feb 25 2016 12:03 PM | Updated on Sep 3 2017 6:25 PM

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామం సమీపంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ముప్పాళ్ల: గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామం సమీపంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయవాడకు చెందిన ఇనుము వ్యాపారి గౌస్ (45) ముప్పాళ్ల మండలం రుద్రవరంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై దమ్మాలపాడు గ్రామానికి బయల్దేరి మార్గ మధ్యంలో పొలాల్లోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కాగా అతడ్ని 108 వాహనంలో సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆస్పత్రికి తరలించే క్రమంలో గౌస్ వెల్లడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement