జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: హోం మంత్రి | Sakshi
Sakshi News home page

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: హోం మంత్రి

Published Tue, Dec 3 2019 2:01 PM

Mekathoti Sucharitha Sudden Checks On Women Police Station In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె గుంటురు మహిళ పోలీసు స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయ, దిశ ఘటనలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై  జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు.

మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని.. ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో దురుసుగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా పోలీసు స్టేషన్‌లో మహిళా అధికారులను నియమించనున్నామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

Advertisement
Advertisement