టీడీపీ హయాంలో పరిశ్రమలు గాడి తప్పాయి : గౌతం రెడ్డి

Mekapati Goutham Reddy Visits Brandix India Company At Vizag - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్‌ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 20 ఉద్యోగాలు కల్పించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో వైఎస్సార్‌ సెజ్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ టీడీపీ హయాంలో పరిశ్రముల పూర్తిగా గాడితప్పాయని ఆరోపించారు. కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top